మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలి : ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం / మహ ముత్తారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరం తరం అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ అన్నారు. గురువారం ఎస్పీ అడవి ముత్తా రం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా పోలీసు సిబ్బంది పని తీరు తెలుసుకుని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి వృత్తి నైపుణ్యం పెంచు కోవాలని సూచించారు. పోలీసులు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, పిఎస్ కేసుల స్థితిగతులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి మహేంద్ర కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయిపై, పేకాట పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ అన్నా రు. అలాగే పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబా టులో ఉండాలని, కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితు లకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఎస్పీ ఆదేశించా రు. మండలంలో మావోయిస్టులు ఎలాంటి చర్యలకు దిగకుం డా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని సూచించారు. పెండింగ్ కేసులను సత్వరంగా పరిష్క రించాలని, పోలీస్ స్టేషన్లోని రికార్డులను ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటా రం డిఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, కాటారం సీఐ నాగార్జున రావు, స్థానిక ఎస్ఐ మహేంద్ర కుమార్, సీసీ ఫసియొద్దీన్, పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.