సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి
– ఓటిపి, ఆధార్, బ్యాంక్ వివరాలు ఇతరులకు తెలపకూడదు.
– అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాల బారి నుండి తప్పించుకోవచ్చు.
-కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్.
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ అన్నారు. తెలంగాణ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో ఫేక్ కాల్స్ తో పాటు మెస్సేజ్ లు వస్తు న్నాయి. సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంన్నాయంటూ కాల్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని నమ్మవద్దన్నారు. గుర్తుతెలియని వ్యక్తులను,గుర్తు తెలియని నెంబర్ల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించక కుడదనిన్నారు.పిల్లలు ఫోన్లో ఎం చేస్తున్నారు, ఏం డౌన్లోడ్ చేస్తున్నారో తప్పకుండా తల్లిదండ్రులు గమలించాలన్నారు. ఆన్లైన్ గేమ్స్ రమ్మీతో పాటు ఇతర గేమ్స్ డౌన్లోడ్ చేసి బెట్టింగ్ లకు గురై తల్లిదండ్రులు ఆర్ధికంగా పడేస్తున్నారు. ముఖ్యంగా యువత చాలామంది అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కావద్దని, తల్లిదండ్రులు తప్పక పిల్లల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చిన వెంటనే కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్లో తెలియ జేయలన్నారు. యాప్స్ లకు దూరంగా ఉండాలని, అపరి చిత నెంబర్ల నుంచి ఫేస్బుక్ వాట్సప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ స్పందించవద్దన్నారు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు కేంద్ర సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి వివరాలు తెలియజేసిన అనంతరం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలని పేర్కొన్నారు.