ఏజెన్సీ ఏరియాలో మెడికల్ క్యాంప్
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం:కన్నాయిగూడెం మండలం లోని గుట్టల గంగారంలో వైద్య సదుపాయాలు లేని ప్రాంతం లో ములుగు ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు కన్నాయిగూడెం ఎస్సై ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ గిరిబాబు గుత్తి కోయ వాసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి, సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పిం చారు. తగిన మాత్రలు, సిరప్ లు, అందజేస్తూ వ్యాధులు రాకుం డా ఉండే సూచించారు. అనంతరం కన్నాయిగూడెం పోలీస్ లకు, మెడికల్ సిబ్బందికి గుట్టల గంగారం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సివిల్ పోలీస్ సిబ్బంది, సీఆర్పీఫ్ పోలీస్ లు , ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.