మారుమూల ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
– ఇందిరమ్మ ఇళ్ల కోట పెంచాలని ప్రయత్నం చేస్తున్నా.
– ప్రతి మండలానికి వచ్చే ఐదేళ్లలో 1500 ఇల్లు మంజూరుకు కృషి
– భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మారుమూల ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలోని మారుమూలైన వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు అన్ని మండలాల అభివృద్ధికి కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమా వేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమా వేశానికి ముందు స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచికంగా మౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేసి ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే వెంక టరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూర య్యాయన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, బడుగు బలహీనవర్గాల పేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతి మండలానికి 15 వందల ఇల్లు చొప్పున మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మొదటి విడత, రెండో విడత, 3, నాలుగో విడత, ఐదో విడత లో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేసేందుకు, ప్రజల మద్దతుతో కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర సంక్షేమ పథకాలతో పాటు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం లక్షం అని ఆయన అన్నారు. సమావేశానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ అధ్యక్షత వహించారు. అభివృద్ధే లక్ష్యంగా తమ వంతు కృషి చేస్తానని, ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేయటాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం సమర్ధించారు. మండల కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కు పాల్పడేవారు ఎటువంటి వారైనా మండల కాంగ్రె స్ దే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీలో చేర్చుకోవాలన్న ,సస్పెండ్ చేయాలన్న మండల కాంగ్రెస్ తుది నిర్ణయం అని, పార్టీ నుంచి తొలగించిన వారు, అసత్యాలతో కార్యకర్తలను గందరగోళం చేస్తున్నారని ఖండించారు. పార్టీకి తెలవకుండా సమావేశాలు పెట్టిన నలుగురిని సస్పెండ్ చేయటాన్ని ఎమ్మెల్యే సమర్థించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్య క్షులు సయ్యద్ హుస్సేన్, పీఏసీఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు ,సీనియర్ నాయకులు మన్యం సునీల్, ధనపనేని నాగరాజు, మద్దు కూరి ప్రసాద్, కళాధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాధన పెల్లి శ్రీను, నాయకులు పల్నాటి నాగేశ్వరావు, సుంకరి నానాజి, మండలంలోని 18 గ్రామపంచా యతీల నుండి హాజరైన కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కే. తిరుపతిరావు, ప్రత్యేక పోలీస్ ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా బందోబస్తు నిర్వహిం చారు.