రావణవధకు కలెక్టర్ కు ఆహ్వానం
ములుగుప్రతినిధి:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించు కొని ములుగులో నిర్వహించనున్న రావణాసుర వధ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ను ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. గురువారం కలెక్టర్ ను కలిసిన వారు గత 23 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ డాక్టర్ శబరిష్, డిఎస్పి రవీందర్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తాసిల్దార్ విజయభాస్కర్ లకు సైతం ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వా నం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్య క్షుడు గండ్రకోట కుమార్, చల్లూరి మహేందర్, గందె రాజు, గుగ్గిళ్ల సుజన్ కుమార్, అనుముల సురేష్, ఎల్కతుర్తి శ్రీహరి, మాదరి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.