ములుగులో రెడ్‌క్రాస్ ప్రత్యేక సభ్యత్వ నమోదు ప్రారంభం

On: May 18, 2026 4:53 PM

ములుగులో రెడ్‌క్రాస్ ప్రత్యేక సభ్యత్వ నమోదు ప్రారంభం

ములుగులో రెడ్‌క్రాస్ ప్రత్యేక సభ్యత్వ నమోదు ప్రారంభం

మే 31 వరకు సభ్యత్వ డ్రైవ్‌లో చేరాలని కలెక్టర్ పిలుపు

ములుగు,మే18,తెలంగాణజ్యోతి: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్ శివ్ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ ప్రత్యేక మెంబర్‌షిప్ డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం తన ఛాంబర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 1 నుంచి మే 31 వరకు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ రెడ్‌క్రాస్ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెడ్‌క్రాస్ సంస్థ ప్రజలకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ప్రత్యేక సభ్యత్వ నమోదు కోసం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో డేటా కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ సభ్యత్వ వివరాల కోసం కోశాధికారి, స్పెషల్ డ్రైవ్ ఇన్‌చార్జ్ శిరుప సతీష్ కుమార్ లేదా జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు రమేష్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి అల్లం రాజ్‌కుమార్, బాసాని రామమూర్తి, మాడిశెట్టి దేవేందర్, ఎనగందుల శంకర్, గైని సతీష్ సభ్యత్వం స్వీకరించగా, రెడ్‌క్రాస్ వైస్ ప్రెసిడెంట్ సంపత్ రావు, ప్రధాన కార్యదర్శి చుంచు రమేష్, కోశాధికారి శిరుప సతీష్ కుమార్, పాలక మండలి సభ్యులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!