కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన న్యాయవాదులు
ములుగు, మే 18, తెలంగాణ జ్యోతి: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును న్యాయవాదులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గట్టమ్మ అడ్వకేట్స్ సొసైటీ తరఫున ములుగు జిల్లా న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ములుగు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలుగు చంద్రయ్య, ఉపాధ్యక్షులు రంగోజు బిక్షపతి, గట్టమ్మ అడ్వకేట్స్ సొసైటీ అధ్యక్షులు మేకల మహేందర్, కోశాధికారి బానోత్ స్వామిదాస్, సంయుక్త కార్యదర్శి రాచర్ల రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.









