కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో అందరికీ సామాజిక న్యాయం
– నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత గుర్తింపు
– భూపాలపల్లిలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం
– ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మాసంపెల్లి లింగాజి
కాటారం, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ పార్టీలో గ్రామం నుండి గ్రామం మండల జిల్లా రాష్ట్ర కమిటీలో సామాజిక న్యాయం పాటిస్తున్నట్లు కాంగ్రెస్ పరిశీలకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల తో మంగళవారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు అధ్యక్షతన సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహ క సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థాగత ఎన్నికల జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మాసంపెల్లి లింగాజి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, మాసంపెల్లి లింగాజి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్ మ్యాప్ ను ఖరారు చేసింద ని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్ఠానం నిర్ణయించ డం, ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తా యని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. పార్టీలో మండల, బ్లాక్, డీసీసీ పదవుల్లో సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులు ఇవ్వాలని సూచించారని, పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై గాంధీభవన్‌లో జరిగిన సమావే శంలో కీలకమైన సూచనలు చేశారని తెలిపారు. డీసీసీలు, మండల, బ్లాక్ కమిటీలే ఇకపై పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తా యని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిందని, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసు కవెళ్ళాలన్నారు. జూన్, జూలై మాసాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని గుజరాత్ మోడల్‌లో సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిందని, సంస్థాగత ఎన్నికల నిర్వహణ నిమిత్తం జిల్లా,అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరిశీలకులుగా మమ్మల్ని నియమించి, స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. సంస్థా గత నిర్మాణం బలంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్ గారు నియమి తులైన నాటి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారని అన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, గడిచిన 15 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల మంజూరు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ పంపిణీ, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, తదితర పథకాలను అమలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. సంస్థాగత ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గుజరాత్ మోడల్‌లో సంస్థాగత నిర్మాణం చేప ట్టాలని నిర్ణయించారని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుండి నుంచి 30వ తేదీ వరకు జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహణ, మే 4 నుంచి 19 వరకు బ్లాక్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వహణ, మే 13 నుంచి 20 వరకు మండల స్థాయి సమావేశాలు ఉంటాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే.. కాంగ్రెస్ సిద్ధాంతమని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో చిత్తశుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ పదవులు రాబోతు న్నట్లు గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని, అహ్మదాబాద్ సీడ బ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణలోనే మొదటగా అమలు చేసి ఆదర్శంగా నిలుద్దామన్నారు.గ్రామ స్థాయి నుంచే కమిటీ నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసి,ఆయా వర్గాల అభిమానం చూరగొనాలన్నదే రాహుల్ గాంధీ ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో పలువురు పిసిసి సభ్యులు, అధికార ప్రతినిధులు, బ్లాక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షు లు, అనుబంధ విభాగాల చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవ ర్గ సభ్యులు పాల్గొన్నారు.