99 రోజుల ప్రణాళికలో పారిశుధ్య పనులు, అంగన్వాడీ తనిఖీలు

On: March 18, 2026 2:41 PM

99 రోజుల ప్రణాళికలో పారిశుధ్య పనులు, అంగన్వాడీ తనిఖీలు

99 రోజుల ప్రణాళికలో పారిశుధ్య పనులు, అంగన్వాడీ తనిఖీలు

ములుగు, మార్చి18, తెలంగాణజ్యోతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ములుగు పట్టణంలోని 19వ వార్డులో కౌన్సిలర్ మరియు బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్ ప్రారంభించి పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టారని, గ్రామాల్లో తాగునీటి సమస్యలు, పారిశుధ్యం, అంగన్వాడీ సేవలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడం ద్వారా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్–రియాన్ మీర్జా, కౌన్సిలర్లు గుంటోజు పావని–నిరంజన్, యాసం వసంత–రవి కుమార్, గుగ్గిళ్ళ దివ్య–సృజన్, కోగిల లక్ష్మీ, ఆంగోత్ పద్మ–దేవ్ సింగ్, కేశేట్టి నవీన్, కుతుబొద్ధిన్, సాంబయ్య, బైకాని సునీత–ఓదెలు, కొత్త సురేందర్, అంగన్వాడీ టీచర్ లక్ష్మీ, వార్డు పెద్దలు చిండం రాయమల్లు, లక్ష్మీ, గండ్రకోట కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!