పుట్ట మధు అనుచిత వ్యాఖ్యలు సరికాదు
– కాటారం కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం మండల కేంద్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాటారం లో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పై పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని కాటారం మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి తన నీచ రాజకీయాలను ప్రజలకు తెలియజేసేలా చేశారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి అక్రమంగా వేల కోట్లు ఆస్తులు సంపాదించి ప్రజలలో తనకున్న ఉనికిని కోల్పోయారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కమిషన్లకు ఆశపడి నాసి రకంగా నిర్మిస్తే బ్యారేజ్ పిల్లర్లు కుంగి వేలకోట్ల ప్రజాధనం వృధా చేశారని, నాసిరకంగా ఓడేడ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని గాలి వానకే కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల లోపే మంథని నియోజకవర్గానికి 330 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారని . మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు శ్రీధర్ బాబు కృషి చేస్తారని, అందుకే మంథని ప్రజలు ప్రతిసారి శ్రీధర్ బాబును గెలిపిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జాతారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునురి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చీమల సందీప్, మహిళ మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రమేష్ రెడ్డి, ఓ బి సి మండల అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, కడారి విక్రమ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గద్దల రమేష్, మాజీ సర్పంచులు కోడి రవికుమార్, రఘురాం నాయక్, మండల ప్రధాన కార్యదర్శి చీమల రాజు, తిరుపతి రెడ్డి, కొట్టే శ్రీహరి, మొగిలి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.