కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రూ.400

Written by telangana jyothi

Published on:

కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రూ.400

– ఎన్నికల ప్రచారంలో దుద్దిళ్ల శ్రీనుబాబు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి గురువారం ప్రచారం నిర్వహిం చారు. మండల కేంద్రంలో గురువారం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ తర్వాత రు. రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామ న్నారు. సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ్ గ్యారంటీలను ప్రవేశపెట్టారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీసం మద్దతు ధర, ప్రతి పేద కుటుంబ మహిళకు సంవత్సరం రు. లక్ష, ఆరోగ్య భీమా రు.25 లక్షలు, యువతకు రు.30 లక్షలు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చీమల సందీప్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మాజీ జెడ్పిటిసి ఆంగోత్ సుగుణ, విజయా రెడ్డి, చీమల వెంకట స్వామి, కడారి విక్రమ్, దోమల సమ్మయ్య, పసుల మొగిలి, కొట్టే ప్రభాకర్, కొట్టే శ్రీహరి, అయిత లక్ష్మణ్ రెడ్డి, మొగిలి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పలువురిని పరామర్శించిన శ్రీను బాబు

కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ కాటారం మండల ప్రధాన కార్యదర్శి కర్క ఉమ శంకర్ ప్రమాదవశాత్తు గాయపడగా శ్రీను బాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోడే రాజిరెడ్డి (కాలు ఫ్రాక్చర్),సమ్మక్క (అనారోగ్యం) దంపతులను పరామర్శించి మెరుగైన వైద్యం అందిస్తానని హామి ఇచ్చారు.

Leave a comment