వేసవిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
– జిల్లా అగ్నిమాపక అధికారి అబ్ధుల్
ములుగు, తెలంగాణ జ్యోతి : వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండ తీవ్రతకు అగ్ని రాజుకోవడం, గడ్డి వాములు, ఇండ్లు కాలడం జరుగుతుందని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఎండీ.అబ్ధుల్ రహీం అన్నారు. అగ్నిమాపక వారవత్సవాల్లో భాగంగా ఆదివారం అగ్ని మాపక కేంద్రంలో అగ్నిమాపక శాఖ జెండాను ఆవిష్కరించి అగ్ని ప్రమాద సమయంలో ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదంలో మరణించిన సిబ్బందికి నివాళులర్పించారు. వారి ఆత్మ శాంతించాలని కోరుతూ మౌనం పాటిం చారు. వారోత్సవాల్లో భాగంగా ములుగు అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది ఉపయోగించే పరికరాలను స్టాల్ లలో ఏర్పాటు చేయగా వాటి పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా అబ్ధుల్ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అగ్నిప్రమాదాలు జరిగినా వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట చేసినప్పుడు, నీళ్లు వేడి చేసుకున్నాక వెంటనే నిప్పు ఆర్పివేయాలన్నారు. ఇళ్లలో విద్యుత్ దీపాలను సైతం జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నగేష్ ,రమేష్ ,భార్గవ్, సురేందర్ మరియు ధన్ సింగ్ పాల్గొన్నారు.