క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ఉచిత శిక్షణ
– హెచ్ సీ ఏ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
– అసోసియేషన్ అధ్యక్షుడు ధనసరి సూర్య
ములుగు, తెలంగాణ జ్యోతి : వేసవిలో క్రీడాకారులకు ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇవ్వనున్నామని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనసరి సూర్య, జై హనుమాన్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి, హెచ్ సీఏ సభ్యులు లక్ష్మణ్ బాబు తెలిపారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాకేంద్రంలోని తంగేడు స్టేడియంలో సమ్మర్ క్రికెట్ ఫ్రీ క్యాంప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 20 నుంచి వేసవి శిక్షణ ఇవ్వనున్నామని, ఇటీవలే అసోసియేషన్ ఏర్పాటు చేసి క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను పెంపొందించేందుకు ఈ శిక్షణ ఉపయోగప డుతుందని తెలిపారు. క్రికెట్ క్రిడాకారులకు అండర్ 16, అండర్ 19, అండర్ 23, పురుష, మహిళ క్రీడాకారులకు క్రికెట్ కోచ్ పైడిమల్ల సందీష్ నేత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. వెనుక బడిన క్రిడాకారులకు ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే విధంగా అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. కావున, జిల్లాలోని క్రీడాకారులు అందివచ్చిన సదవ కాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 18లోపు https://www.hycricket.org/data-202425/summer-camp-apr-2024/ sc-regn-inactive.html వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య తెలిపారు.