Mulugu | ములుగు జిల్లాలో 3 విడుతలుగా పంచాయతీల ఎన్నికలు
ములుగు, నవంబర్ 25,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో మొత్తం 9 మండలాలు, 146 గ్రామ పంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మొదటి విడతలో డిసెబర్ 11న 48 గ్రామ పంచాయతీలు, 420 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా తాడ్వాయి మండలంలో 18, ఏటూరునాగారం మండలంలో 12, గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో డిసెంబర్ 14న 52 గ్రామ పంచాయతీలు, 462 వార్డుల్లో ఎన్నికలకు గాను మల్లంపల్లి మండలంలో 10, ములుగులో 19, వెంకటాపూర్ లో 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కొనసాగనున్నాయి. మూడో విడతలో డిసెంబర్ 17న 46 గ్రామ పంచాయతీలు, 408 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా వెంకటాపురం మండలంలో 18, వాజేడులో 17, కన్నాయిగూడెం మండలంలో 11 గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. మొత్తం మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా, ఎన్నికలు మధ్యాహ్నం వరకే జరుగనుండగా ఫలితాలు సాయంత్రం వరకు బయటకు రానున్నాయి.





