వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి

On: March 16, 2026 6:54 PM

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి

వాహనదారులు క్షేమంగా గమ్యస్థానాలకు  చేరాలి

వెంకటాపురం నూగూరు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు “సేఫ్ లైవ్–అరైవ్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి భద్రత నియమాలను పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశముందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డు భద్రతపై జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఐ తిరుపతి రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ చి. డెం మోహన్‌రావు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!