Bogatha బొగత జలపాతాన్ని మరిపిస్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం శివారు నూగూరు రోడ్ పెట్రోల్ బంకు వద్ద పగిలిన మిషన్ భగీరథ మెయిన్ పైపులు పగిలి పోవటంతో వెంకటాపురం మండలం లో నిలిచిపోయిన మంచినీటి సరఫరా నిలిచి పోఇంది. ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ కేంద్రం శివారు పెట్రోలు బంకు సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులు శనివారం సాయంత్రం ఒక్కసారిగా పగిలిపోవడంతో నీటిని వెదజల్లు తో బోగత జలపాతాన్ని తలపించే విధంగా ఉందని పలువురు సెల్ఫీలు తీసుకుంటున్నారు. కాగా వాజేడు మండలం లోని మిషన్ భగీరథ ప్లాంట్ నుండి వెంకటాపురం, వాజేడు మండలాలకు నీటి సరఫరా జరుగుతున్నది .ఆర్డబ్లస్, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాసిరకం మెయిన్ పైపులు, ఇంటర్నల్ పైపులు వేయటంతో తరచుగా పైపులైన్లు మరమ్మతులు గురై గ్రామాలకు మంచినీటి సరఫరా కు అంతరాయం కలుగు తున్నది. మిషన్ భగీరథ యంత్రాంగం, ఆర్. డబ్యు.ఎస్ ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు విధుల్లో ఉన్న పైపులైన్లు లీకేజీ విషయంపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితిని ఏర్పడింది. వెంకటాపురం మండలం లోని 18 పంచాయతీలతో పాటు వందలాది గ్రామాలకు మంచినీళ్లు సరఫరా శనివారం సాయంత్రం నుండి, ప్రధాన లైన్ పగిలి పోవడంతో నిలిచిపోయినట్లు సమాచారం. శాంతినగర్ సమీపంలో సుమారు 7 ,8, అడుగులు ఎత్తున మిషన్ భగీరథ పైప్ లైన్ వాటర్ వెదజల్లుతూ ప్రధాన రహదారి పక్కన వచ్చే పోయే వాహనదారులను ఆకర్షిస్తున్నది. అయినా కానీ మిషన్ భగీరథ ఆర్డబ్యుఎస్ అధికారులు నిర్లక్ష్యంగా, వ్యవహరిస్తోందని వెంకటాపురం ప్రజలు శనివారం రాత్రి చరవాణిల ద్వారా మీడియా ప్రతినిధులకు తెలిపారు.