నవరాత్రి ఉత్సవాలలో మహా సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి

On: December 3, 2025 2:37 PM
నవరాత్రి ఉత్సవాలలో మహా సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి

నవరాత్రి ఉత్సవాలలో మహా సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి 

– దత్తాత్రేయునికి అభిషేకం, అర్చన నిర్వహించిన శ్రీధర్ బాబు

కాటారం, డిసెంబర్ 3 ,(తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి జిల్లా ఆటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో జరుగుతున్న దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. నవరాత్రుల సందర్భంగా దత్తాత్రేయ దేవాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం మహా సుదర్శన యాగం లో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు శ్రీ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, అర్చనలు పూజలు నిర్వహించారు వీర బ్రాహ్మణులు మంత్రి శ్రీధర్ బాబుకు ఆశీర్వచనం చేశారు. నవరాత్రి ఉత్సవాలలో ఆలయ అర్చకులు శ్రీరాంపట్ల కృష్ణ మోహన్ శర్మ, సుమిత్ శర్మ, గణేష్ శర్మ, ప్రవీణ్ శర్మ, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!