ప్రభుత్వ నేతల అండదండలతో మిల్లర్లు పీడీఎస్ దందా చేస్తున్నారు
– సివిల్ సప్లై ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు
– బీజేపీ ఎస్టీ మోర్చ రాష్ర్ట ప్రదాన కార్యదర్శి సురేందర్
ములుగు ప్రతినిధి: ప్రభుత్వ నేతల అండదండలతో మిల్లర్లు పీడీఎస్ దందా చేస్తున్నారని, ఇతర రాష్ర్టాలకు బియ్యాన్ని నూకగా చేసి తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టించు కోవడంలేదని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ర్ట అధికార ప్రతినిధి కొత్త సురేందర్ ఆరోపించారు. బుధవారం ములుగులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షుడు గాదం కుమార్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మంత్రుల అనుచరలు ఏజెన్సీలో ఇసుక దందా చేస్తున్నారని, జిల్లా కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం సమీపంలో 100ఎకరాల్లోని ప్రభుత్వ భూముల్లో మట్టి దోపిడీ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అయినప్పటి నుంచి పీడీఎస్ రైస్ దందా ఇష్టా రాజ్యంగా జరుగుతోందన్నారు. మిల్లర్లు సైతం దందాను యథేచ్చగా నడిపిస్తున్నారన్నారు. సివిల్ సప్లై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, మిల్లర్లపై తనిఖీలు నిర్వహిస్తే దందా బయటపడుతుందని, గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో మట్టి, ఇసుక దందా కొనసాగుతోందన్నారు. య్వారీ యజమా నులతో లోపాయి కారి ఒప్పందాలు కుదుర్చుకుంటు న్నారన్నారు. అర్థరాత్రి మొరం తరలిస్తూ గుట్టలను గుళ్ల చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కోశాధికారి గంగిశెట్టి రాజకుమార్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాయించు నాగరాజు, మండల ఉపాధ్యక్షుడు హేమాద్రి, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు అజ్మీర కిషోర్ నాయక్, బానోత్ దేవ్ సింగ్, కళ్లెపు ప్రవీణ్, ఇనుముల మహేష్, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.