పంచాయితీ సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బంది

Written by telangana jyothi

Published on:

పంచాయితీ సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బంది

కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి:పల్లెల్లో పట్టు కొమ్మలు గా వర్ధిల్లుతున్న గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది కి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న వైనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామ పంచాయతీలలో కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులకు, మండల పంచా యతీ అధికారికి, మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రాలు అందజేశారు. కాటారం మండలం ప్రతాపగిరి, చిదినేపల్లి, మద్దులపల్లి గ్రామపంచాయతీలకు 9 నెలలుగా వేతనాలు రాలేదని కార్మికులు, సిబ్బంది ఆందోళన చెందు తున్నారు. గంగారం గ్రామపంచాయతీకి రెండు నెలలుగా, రేగుల గూడెం గ్రామ పంచాయతీకి ఐదు నెలల నుండి వేతనాలు రాలేదని సిబ్బంది తెలిపారు. ప్రతాపగిరి గ్రామ పంచాయతీ సిబ్బందికి 10 నెలల నుండి వేతనం అందక ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది విలేకరులకు తెలిపారు. ప్రభుత్వం పంచాయితీలకు 150 కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటనలకే పరిమితమైనట్లు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ గోడును పట్టించుకొని పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి తక్షణమే వేతన గ్రాంటును విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

Leave a comment