ఐలాపురంలో వైద్య శిబిరం.
తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం : కన్నాయిగూడెం పి హెచ్ సి పరిధిలోని ఐలాపురం గ్రామంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ప్రణీత్ కుమార్ వైద్య శిబిరాన్ని నిర్వహిం చారు. ఐలాపురం గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావడం దూరంగా ఉన్నందు వలన ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వే చేసి జ్వరం, వంటి నొప్పులు, బిపి, షుగర్ టెస్టులు నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ ప్రణీత్తోపాటు హెల్త్ అసిస్టెంట్ భాస్కరరావు ఆశ వర్కర్ మల్లేశ్వరి లు పాల్గొన్నారు.