ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మావోల డంప్ లభ్యం

Written by telangana jyothi

Published on:

ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మావోల డంప్ లభ్యం

– ములుగులో వివరాలు వెల్లడించిన ఎస్పీ శబరీష్

ములుగు ప్రతినిధి : నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలు భద్ర పరుచుకున్న ఆయుధ డంపును పోలీసులు గుర్తించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల అటవీ ప్రాంతంలో డంపు గుర్తించిన పోలీసులు తుపాకులు, మందు గుండు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. అందుకు సంబం ధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం బంధాల రిజర్వు ఫారెస్ట్ పరిధిలోగల వోడ్డుగూడెం వెట్టెవాగు వద్ద సీపీఐ మావోయిస్టు ఆయుధాల డంపు ఉంద న్న విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా పోలీసులు, బీడీ టీం బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ నిషేధిత సీపీఐ మావోయిస్టులు భద్రపరిచిన ఆయుధాల డంపును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీన పరు చుకున్న ఆయుధాల్లో మూడు తుపాకులు ఉన్నట్లు పేర్కొ న్నారు. 7.62ఎంఎం ఎస్ఎల్ఆర్, 7.62 ఎంఎం ఎస్ఎల్ఆర్ బెల్జియం మోడల్, 3006ఎంఎం స్ప్రింగ్ ఫీల్డ్ తుపాకుల తో పాటు 165రౌండ్ల బుల్లెట్లు, 2 బోర్ క్యాట్రిడేజ్లు, ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్ 2, మ్యాగజైన్ పౌచెస్ 4 లభ్యమైనాయన్నారు. కాగా, అజ్క్షాతంలో ఉన్న మావోయిస్టులు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయావాలని ఎస్పీ సూచించారు. లొంగి న మావోలకు ప్రభుత్వ పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్.రవీందర్, తాడ్వాయి సీఐ జి.రవీందర్,ఎస్సై శ్రీకాంత్ రెడ్డి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now