పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం మండలం ముకునూరు పాలెంకు చెందిన మడవి కోసయ్య (31) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటాపురం ఎస్ఐ కే. తిరుపతిరావు కథనం ప్రకారం.. మధ్యం తాగేందుకు తరుచు డబ్బులు కోసం వేధింపులకు గురి చేసేవాడ నీ, మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని మనస్థాపానికి చెంది పురుగుమందు తాగాడు. ఈ మేరకు వెంకటాపురం ప్రభుత్వ వైశ్యాలకు చికిత్స కోసం తరలిస్తుండగా, శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే. తిరుపతిరావు విలేఖరులకు తెలిపారు.