హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జైలుకు తరలింపు
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం: కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్లో ఇటీవలే ఏప్రిల్ 11 బౌతు రాజును కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన దుర్గం మహేష్ పరారీలో ఉండ గా గురువారం పోలీసులు పట్టుకొని జైలుకు తరలించినట్లు కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ విలేకరులకు తెలిపారు. ఎవరు కూడా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని తెలిపారు.