ఆగి ఉన్న కారును వెనకనుంచి ఢీకొట్టిన లారీ

On: April 16, 2026 7:17 PM

ఆగి ఉన్న కారును వెనకనుంచి ఢీకట్టిన లారీ

ఆగి ఉన్న కారును వెనకనుంచి ఢీకొట్టిన లారీ

 వ్యక్తికి తీవ్ర గాయాలు

ములుగు, ఏప్రిల్ 16 తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని విద్యుత్ కేంద్రం ఎదురుగా ప్రధాన రహదారిపై ఆగిఉన్న కారును లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లికి చెందిన విద్యుత్ ఉద్యోగి చంద్రగిరి కుమారస్వామి తన స్విఫ్ట్ డిజైర్ కారులో పని నిమిత్తం వచ్చి సబ్ స్టేషన్ ఎదుట రోడ్డుకు పక్కకు ఆపుకొని ఉన్నాడు. బండారుపల్లి వైపు నుంచి ములుగుకు వస్తున్న లారీ డ్రైవర్ అధిక వేగంతో వచ్చి కారును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో కారులో ఉన్న కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ధ్వంసం కాగా వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా లారీ డ్రైవర్ ను పోలీసులకు అప్పగించగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!