చెల్లిని ప్రేమించిన యువకుడి తండ్రిని కిడ్నాప్ చేసిన అన్న
విచారణ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
ములుగు, ఏప్రిల్16, తెలంగాణ జ్యోతి : తనచెల్లిని ప్రేమించిండనే కక్షతో యువకుడి తండ్రిని కిడ్నాప్ చేయగా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించిన సంఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో గురువారం జరిగింది. ఎస్సై యు.ఉపేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన రుద్రారపు శివ వెంకటేశ్వర్లపల్లికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి అన్న గుగులోతు రాజేష్ స్నేహితులు సునీల్, అరవింద్, హరికృష్ణ, హరిదాసులతో కలిసి బుధవారం రాంచంద్రాపూర్ చేరుకున్నారు. శివ దొరకకపోవడంతో అతని తండ్రి అయిలయ్య కనిపించడంతో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఐలయ్యను ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసి ఆటోలో సైతం కొట్టారు. ఈవిషయంపై బాధితుని భార్య సునీత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఎస్సై ఉపేందర్ రావు సిబ్బందితో బృందాలుగా ఏర్పడి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి నిందితుల జాడ కనిపెట్టారు. ఆటోలో పారి పోతుండగా మల్లంపల్లి వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ములుగులోని జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.









