జాతీయ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లకు ఆహ్వానం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జాతీయ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్) గుగులోత్ దేశపతి నాయక్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ, పోస్టు రీసెర్చ్ కార్యక్రమాలను చేయడానికి విద్యార్థులు ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31 తారీకు లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
1 thought on “జాతీయ ఓవర్సీస్ స్కాలర్ షిప్ లకు ఆహ్వానం ”