ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వెంకటాపురం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం ఆవరణలో మండలవిద్యాధికారి జీవివి సత్యనారాయణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని సంఘం ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏ. టి. ఏ. ఆర్గనైజింగ్ కార్యదర్శి పసుల సూర్యనారాయణ మాట్లాడుతూ సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వ ఆమోదించాలని, వారి సమ్మె కారణంగా ఏజెన్సీలో విద్యా వ్యవస్థ కుంటుపడుతున్న కారణంగా ప్రభుత్వం న్యాయ మైన డిమాండ్లను వెంటనే ఆమోదించచాలని కోరారు. జీవో నెంబర్ 317 ప్రకారం స్థానికతను గుర్తించి వారి జిల్లాలకు పంపిం చి పోస్టులను భర్తీ చేయాలని ఏ.టి.ఏ ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి. కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. భుజంగరావు, సభ్యులు యాలం సురేష్, టి. కామేశ్వరరావు, కారం నాగరాజు, జే. సుధాకర్ రావు, చింతా శేష నరసింహారావు, కృష్ణారావు, మహిళా ఉపాధ్యాయులు బి. రమా దేవి, జే. పుష్ప లత,కవిత, నాగమణి, స్రవంతి, కేరమణ, కే సునీత, వై ఝాన్సీ, లక్ష్మి ఇంకా పలువురు సంఘం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.