ఏజెన్సీలో అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలి
– గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రేగ గణేష్
– చోద్యం చూస్తున్న అధికారులు – నిద్రావస్థలో రెవిన్యూ శాఖ..?
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు మెమోరాండం అందజేశారు. అనంతరం జిఎస్పీ జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ మాట్లాడుతూ వెంకటాపురం తాసిల్దార్ ను కలిసి ఏజెన్సీ ప్రాంతంలో 1/70చట్టానికి విరుద్ధంగా వలస గిరిజ నేతరులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని వాటినీ కూల్చి వేయాలని వినతిపత్రం లో డిమాండ్ చేశారు. వెంకటాపురం (జెడ్) సర్వే నెంబరు 2/69 లో గిరిజనేతర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేస్తూ స్థిరాస్తు లు కూడ పెట్టుకుంటుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో భద్రాచలం పి.ఓ గా విధులు నిర్వహించిన ఐఏఎస్ వీ.పీ. గౌతమ్ వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి రక్షణగా ప్రభుత్వ సరిహద్దు భూమి కి దిమ్మలు ఏర్పాటు చేశారని, ఆ ప్రభుత్వ భూములను గిరిజనేతరుల కబంధ హస్తాల్లో చేరాయని అన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రోటోకాల్ కూడా పాటించ లేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై గిరిజనేతరులకి ఎలా హక్కు ఉంటుందని హెచ్చరించారు. ఏజెన్సీలో 1/70 పిసా చట్టాలను అమలు చేయని అధికారులను ఏజెన్సీ ప్రాంతం నుండి మైదానం ప్రాంతానికి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా వెంకటాపురం మండల పరిధిలో విచ్చల విడిగా గ్రావెల్ దంద జరుగుతున్న పట్టించు కోవడం లేదని, రెవెన్యూ అనుమతి మేరకే జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జి ఎస్ పి ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు చింత మోహన్., జిల్లా ప్రధాన కార్యదర్శి. కణితి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.