మాజీ ఎంపీపీ ని సన్మానించిన మైనార్టీ కాంగ్రెస్ జిల్లా నాయకులు

Written by telangana jyothi

Published on:

మాజీ ఎంపీపీ ని సన్మానించిన మైనార్టీ కాంగ్రెస్ జిల్లా నాయకులు

– మైనార్టీ కాలనీ మంజూరుకు కృషి చేద్దామన్న మాజీ ఎంపీపీ

– మైనార్టీల సంక్షేమానికి మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ

మహాదేవపూర్,తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండ ల ప్రజలకి గత ఐదేళ్లగా సేవలు అందించి, మండల అభివృద్ధికి, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిన తాజా మాజీ ఎంపీపీ బి.రాణీబాయి రామారావు ను జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నాయకులు శాలువాలతో సత్కరించారు. జిల్లా మైనార్టీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్, ఉపాధ్యక్షులు ఇరిషాద్ అహ్మద్, కార్యదర్శి గయాస్ ఖాన్, నాయకులు కలిమొద్దీన్, శంశీర్ ఖాన్ తదితరులు మాజీ ఎంపీపీ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాణీబాయి రామా రావు మాట్లాడుతూ గత ఐదేండ్లలో మైనార్టీ సంక్షేమం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. మండల పరిషత్ నిధులతో ఈద్గా చుట్టూ రు.15 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మించామని, చిన్న మసీదు వద్ద రు.5 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, గ్రామంలోని మూడు మసీదు వద్ద, ఖబ్రస్థాన్ లో రు. 6.50 లక్షలతో హమాస్ లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈద్గా వద్ద బోరు బావిని మంజూరు చేశామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తారనీ, మనమందరం కలిసి కట్టుగా మంత్రి నీ కలిసి ప్రత్యేక కోటా ద్వారా 100 ఇందిరమ్మ ఇండ్లతో మైనార్టీ కాలనీ ఏర్పాటుకు కృషి చేద్దామనీ అన్నారు. ఉర్దూ మీడియం హైస్కూల్ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు, టీచర్ పోస్టుల మంజూరుకు కృషి చేద్దామని మాజీ ఎంపీపీ బి.రాణీబాయి రామారావు అన్నారు. మైనార్టీ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇరిషాద్ అహ్మద్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాలికలు రూపొందిస్తు న్నారని అన్నారు. తనను ఘనంగా సన్మానించిన మైనార్టీ కాంగ్రెస్ కమిటీ నాయకులకు మాజీ ఎంపీపీ బి.రాణీబాయి రామారావు కృతజ్ఞతలు తెలిపారు..

Leave a comment