నూతన యువజన కాంగ్రెస్ అధ్యక్షునికి ఘణ సన్మానం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఘన విజయం సాధించిన చిట్టెం సాయి కృష్ణ స్వామికి గురువారం స్థానిక అతిథి గృహం ఆవరణలో మండ ల,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా సన్మానించి అభినందనలు తెలిపారు. మండల యూత్ కాంగ్రె స్ అధ్యక్షునిగా ఎన్నికైన చిట్టెం సాయి కృష్ణ స్వామి మాట్లాడు తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యవేక్షణలో యూత్ కాంగ్రెస్ బలోపేతం చేసే క్రమంలో అందరి సహకారం తీసుకొ ని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకా లు అర్హులైన వారికి అందే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం మండల యాత్ కాంగ్రెస్ ఉపాథ్యక్షులుగా గార్ల పాటి క్రాంతి కుమార్ ను ఎన్ను కున్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయానికి యూత్ కాంగ్రెస్ తరపున కృషి చేస్తామని ఈ సందర్భంగా అధ్యక్షుడు చిట్టెం సాయి కృష్ణ స్వామి హామీ ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పరస్పరం మిఠా యిలు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు బాల సాని వేణు, రమేష్ మురళి, మద్దుకూరి ప్రసాద్, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూర్ నాగారం లో బస్ డిపో మంజూరు చేయడం పట్ల ఆయా శాఖల మంత్రులకు, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు.