సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, తెలంగాణ జ్యోతి : తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుండి లైసెన్స్
సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు తెలంగాణ లోని అన్ని మీ సేవా కేంద్రాలలో లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కార్యక్ర మానికి దరఖాస్తు చేయకోవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మొత్తం 50 పని దినాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల అర్హతలు ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి) కనీసం 60% మార్కులతో ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్)లేదా ఇతర సమానమైన అర్హత ఉండాలి. దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టర్స్ మే 5 నుండి మే 17 వ తేదీ వరకు మీ సేవా కేంద్రాలలో మాత్రమే రూ 100/- చెల్లించి పొందవచ్చునని అన్నారు. మీ సేవ కేంద్రాల్లో ఈ నెల 25 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు వివరాలు ఓ సి లకు రూ10 వేలు, బిసి లకు రూ5 వేలు,ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులకు రూ. 2,500 చెల్లించాలి. లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా మారేందుకు ఇదొక సువర్ణ అవకాశమని అర్హత కలిగిన అభ్యర్థులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మానేజ్మెంట్ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టంచేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment