గుడుంబా పట్టివేత – నలుగురు అరెస్టు
– రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని పేరూరు పోలీ సులు ఆదివారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనాలపై గుడుంబా తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టు పడ్డారు. టేకులో గూడెం వద్ద చేసిన తనిఖీలలో ప్యాకింగ్ చేసిన 160 లీటర్ల గుడుంబా విడి ప్యాకెట్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుడుంబా విలువ సుమారు 64, వేలు ఉంటుందని పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు తాడూరి రవీందర్, దాగం మధుసూద న్, తల్లాడి ప్రశాంత్, కురుసం నరేష్, అనే నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టే బుల్ కే. సాంబశివరావు, కానిస్టేబుళ్ళు నరేష్, మరేశ్వరరావు, నవీన్, వెంక టేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.