ఆర్వోఆర్ ముసాయిదాపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం
హైదరాబాద్ : ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్ -2024 ముసాయిదాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని లైసెన్స్డ్ సర్వేయర్లు వెల్లడించారు. హైదరాబాద్ లక్డికపూల్లో నిర్వహించిన సమావేశంలో ఆర్వోఆర్-2024 ముసాయిదాపై చర్చించారు. సమావేశానికి డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, భూ చట్టాల నిపుణుడు సునీల్ హాజర య్యారు. లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఆర్వోఆర్ ద్వారా భూ సమస్యలకు పరిష్కారం దొరుకు తుందని వివరించారు. సునీల్ మాట్లాడుతూ ప్రతి లైసెన్స్డ్ సర్వేయర్ గ్రామీణ ప్రజలకు ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. సర్వేయర్లు మాట్లాడుతూ ముసా యిదా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. భూ యజమానుల హక్కులను పూర్తిస్థాయిలో కాపాడాలంటే ప్రభుత్వం ఆర్వోఆర్-2024 చట్టాన్ని సమగ్రంగా తీసుకురా వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అభిప్రాయపడింది. ఆర్వోఆర్ -2024 ముసాయిదాపై హైదరాబాద్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించా లని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కోరారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ జైన్ డైరెక్టర్ దేవదాసు, ఆర్ డి డి వెంకటరమణ, తెలంగాణ సర్వే అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, ములుగు జిల్లా నుండి జిల్లా లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాస్ తో పాటు వివిధ జిల్లాకు సంబంధించిన లైసెన్స్ సర్వేయర్స్ పాల్గొన్నారు.