ములుగులో ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన
భక్తి నినాదాలతో మార్మోగిన పట్టణం
భారీగా పాల్గొన్న మాలధారులు
ములుగు, మే6,తెలంగాణజ్యోతి: ములుగుజిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ నగర సంకీర్తన వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమై పట్టణమంతా భక్తి వాతావరణంతో మార్మోగింది. గురుస్వాములు పేరబో యిన శ్రీధర్,ఇమ్మడిరమేశ్, కొనుపుల కుమార్ల ఆధ్వర్యంలో శ్రీ రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమై జాతీయ రహదారిపై కొనసాగింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మాలధారులు భజనలు, కోలాటాలు, నృత్యాలతో ఊరేగింపును ఆధ్యాత్మిక ఉత్సవంగా మార్చారు. ఆంజనేయుడికి ఇష్టమైన చందనాన్ని ఒంటికి పూసుకొని భక్తులు తమ విశ్వాసాన్ని వ్యక్తపరచగా, చిన్నారులు దీక్షతో పాల్గొని చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు స్వామివారికి నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టడం ద్వారా భక్తి భావాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ నగర సంకీర్తనలో భారీగా భక్తులు పాల్గొన్నారు. డీజే పాటల నడుమ స్వాములు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రను మరింత అట్టహాసంగా మార్చారు. భక్తి గీతాలు, డీజే మ్యూజిక్ కలయికతో పట్టణం అంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. ప్రతి వీధిలోనూ స్వాములు గుంపులుగా చేరి నృత్యాలతో సందడి చేయగా, జై శ్రీరామ్ నినాదాలతో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంప్రదాయ భజనలు, ఆధునిక సంగీతం కలిసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుని, పాల్గొన్న ప్రతి ఒక్కరిలో భక్తి ఉత్సాహం నింపింది. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ములుగు ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ బిక్షపతి, 19 వార్డు కౌన్సిలర్ పౌడాల ఓం ప్రకాష్, 8వ వార్డు కౌన్సిలర్ నల్ల స్వాతి, మాలధారులు ఆవుల ప్రశాంత్ రెడ్డి స్వామి బాణాల రాజ్ కుమార్ స్వామి ఒజ్జల కుమార్ స్వామి నాగరాజు స్వామి నరెడ్ల శంకర్ స్వామి ఇమ్మడి మధు స్వామి హరి గల బురిడీ స్వామి చక్రపు రాజు స్వామి జక్కుల రేవంత్ యాదవ్ స్వామి ఎన్ రమేష్ స్వామి స్వామి బైకని నటరాజ్, సంపత్, కుమార్, మధు, రాజు, రేవంత్, చందు, సంతోష్, శివసాయిరాం, శ్రీను, మనోహర్, శంకర్, అభిలాష్, చందర్, వాసుదేవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తి ఉత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమం ములుగులో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందించింది.









