బీజేపీ ఘనవిజయం పట్ల వాజేడులో మిన్నంటిన సంబరాలు
వెంకటాపురం నూగూరు, మే 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో, వాజేడు మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు రాత్రి భారీ సంబరాలు నిర్వహించారు. బాణాసంచాలు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సాహం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్లో సాధించిన విజయాన్ని చారిత్రాత్మకంగా పేర్కొంటూ, అనేక మంది కార్యకర్తల త్యాగాల ఫలితమే ఈ విజయమని నాయకులు అన్నారు. అదే విధంగా అస్సాంలో మూడోసారి అధికారంలోకి రావడం, పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయాన్ని వారు ప్రస్తావించారు. మూడు రాష్ట్రాల్లో సాధించిన ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని వాజేడు కేంద్రంలో కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు పెద్ది జగపతిబాబు, సీనియర్ నాయకులు కందుల రామ్కిషోర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సాగి సీతారామరాజు, యలం సుబ్బయ్య, బడే షణ్ముఖారావు, శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









