రైతులపై ప్రభుత్వ అణిచివేత ధోరణి నిలిపివేయాలి

రైతులపై ప్రభుత్వ అణిచివేత ధోరణి నిలిపివేయాలి

రైతులపై ప్రభుత్వ అణిచివేత ధోరణి నిలిపివేయాలి

– బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు వినతి పత్రం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : రాజ్యాంగంపై ప్రమాణం చేసి అదికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగ డుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, దళిత, గిరిజనులను, రైతులను తీవ్రంగా అణచివేతకు గురి చేస్తున్నారని, పేద దళిత గిరిజన, రైతుల భూములను బలవంతంగా లాక్కొని రోడ్ న పడేస్తున్నారని, ప్రభుత్వ నిరంకుశ ధోరణి విడ నాడాలని కోరుతూ ములుగు జిల్లా వెంకటాపురం మండల బి.ఆర్.ఎస్. పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. పార్టీ మండల పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక అతిధి గృహం ఎదురుగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడి విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి విడనాడాలని, లగచర్ల రైతులపై అణిచివేత ధోరణి విడనా డాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై చేస్తున్న అరాచకాలను వెంటనే అరికట్టాలని, ముఖ్యమంత్రి సోదరులు ,బందువులు ఆదేశాల మేరకే పోలీసులు రైతులపై విచక్షణా రహితంగా కేసులు పెట్టి అవమాన పరుస్తున్నారని ఆరోపిం చారు. పోలీసులు థర్డ్ డిగ్రీ రైతులపై ప్రయోగిస్తున్నారని ,ప్రజా అణిచి వేత ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహ రిస్తున్నదని, అంబేద్కర్ కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుండి, లగచర్ల రైతులను, దళిత గిరిజన రైతులను కాపాడాలని, ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ప్రజా ఆందోళ నలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎ స్ పార్టీ మండల అధ్యక్షులు గంపా రాంబాబు, మండల సీనియ ర్ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ, పార్టీ అధికార ప్రతిని ధి, సీనియర్ నాయకులు డర్రా దామోదర్, సీనియర్ నాయకు లు జక్కుల సమ్మయ్య, న్యాయ వాది చిడెం రవికుమార్, గడ్డం వివేక్, జాగర శివాజీ యాధవ్ , ఇంకా పలువురు కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment