పుష్కర భక్తులకు సౌకర్యాల కల్పనలలో ప్రభుత్వం విఫలం
కాటారం తెలంగాణ జ్యోతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నటువంటి సరస్వతి నది పుష్కరాలు భక్తులకు సౌకర్యాలు కల్పనల ఏర్పాట్లు విఫలమైందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, భాజపా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా శాఖల అధ్యక్షులు నిశిధర్ రెడ్డి,రెడ్డి కర్రే సంజీవరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి ఆరోపించారు. కాలేశ్వరంలో త్రివేణి సంగమ తీరం లో పుష్కర స్నానం ఆచరించారు. శ్రీ కాలేశ్వర ముక్తీశ్వర స్వామి ని దర్శించుకుని పూజలు చేశారు. పుష్కర ఘాట్ లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయాగరాజు కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గొప్పలు చెప్పినప్పటికీ భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం అందడం లేదని విమర్శించారు. ప్రపంచ సుందరి మణులు రామప్ప క్షేత్ర సందర్శనకు వచ్చినప్పుడు వాళ్ల కాళ్లను తెలుగింటి ఆడపడుచులతో కడిగించి అవమాన పరిచారని ఆరోపించారు. కాళేశ్వరం లో సామాన్య భక్తులు దేవస్థానంలో దర్శనం చేసుకోవడం గగనమైందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు దుర్గం తిరుపతి, ఆటారం మహాదేవపూర్ మండల శాఖల అధ్యక్షులు మనోజ్, పాగె రంజిత్, పూర్ణచందర్, శ్రీకాంత్, శ్రీధర్, మహేష్ రెడ్డి,కిషన్, శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.