వైభవంగా కొనసాగిన నగర సంకీర్తన

వైభవంగా కొనసాగిన నగర సంకీర్తన

వైభవంగా కొనసాగిన నగర సంకీర్తన

– హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహణ

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ రామాలయ ప్రాంగణం నుండి స్వాములు హనుమాన్ సంకీర్తనలను కీర్తిస్తూ, చాలీసా పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక భక్తి గేయాలు, కోలాటాలతో శనివారం నగర సంకీర్తన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో హనుమాన్ స్వామికి అభిషేకం నిర్వహించారు. ఉదయం 7:35 గంటల నుంచి 11: 30 గంటల వరకు 4 గంటల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి సభ్యులు, పలువురు హిందూ బంధువులు స్వచ్ఛందంగా ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. గ్రామంలోని పుర వీధులు గుండా “శ్రీరామ జయరామ జయజయరామ, శ్రీ హనుమ జై హనుమ జయ జయ హనుమ” అంటూ గ్రామంలో నగర సంకీర్తన కొనసాగగా భక్తి భావ గీతాలతో వీధులు మారుమోగాయి. నగర సంకీర్తనకు స్త్రీలు మంగళ హారతులతో స్వాగతం పలికి నీల్లార పోశారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ భక్త మండలి సభ్యులు మాట్లాడుతూ నగర సంకీర్తనకు వివిధ రకాలుగా సహకరించిన దాతలకు ఆ భగవంతుని కృప కటాక్షాలు వారికి, వారి కుటుంబానికి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వాములు ఇమ్మడి రమేష్ రమేష్ గురు స్వామి,పేరబోయిన శ్రీధర్ గురుస్వామి, తుమ్మ రామకృష్ణ గురుస్వామి, కొనుపుల కుమార్ గురు స్వామి, ఆవుల ప్రశాంత్ రెడ్డి, బానాల రాజకుమార్, కొండి మహిపాల్, ఆకుల రాజు, బత్తుల సురేందర్, నాగరాజు, రాజు, సతీష్, వేములపల్లి రాజు, తిరుపతి, రాంబాబు,రమేష్ కోడి, రామాచారి స్వామి, బోయిరి మనోహర్, ఒజ్జల కుమార్, లతోపాటు హనుమాన్ మాలాధారణ స్వాములు, రామాలయ కమిటీ సభ్యులు, భక్తులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. అనంతరం రామాలయ ప్రాంగణంలో హనుమాన్ స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment