కాలేశ్వరంకు పోటెత్తిన భక్తులు

కాలేశ్వరంకు పోటెత్తిన భక్తులు

కాలేశ్వరంకు పోటెత్తిన భక్తులు

– మహాదేవపూర్ నుండి కాలేశ్వరం కు బారులు తీరిన వాహనాలు

– ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

కాటారం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలో ఈనెల 26వ తేదీ వరకు జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో శనివారం భక్తజన సందోహంతో పోటెత్తింది. పుష్కర స్నానం చేసేందుకు చేసేందుకు భక్తులు దూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చారు మహదేవపూర్ నుండి కాలేశ్వరం వరకు గల 3503 జాతీయ రహదారిపై వాహనాలు ట్రాఫిక్ జామైంది దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సిబ్బందితో స్వయంగా రంగంలోకి దిగి మోటార్ సైకిల్ పై పర్యటిస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. శనివారం ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పుష్కర స్నానం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పుష్కర స్నానం కోసం శనివారం ఉదయం నుండి వందల సంఖ్య లో వాహనాలలో భక్తులు కాలేశ్వరం కు తరలి వస్తున్నారు.

పిండ ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం

సరస్వతి పుష్కరాల్లో భాగంగా శనివారం ఉదయం కాళేశ్వరము సరస్వతి ఘాట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోదరుడు మల్లు ప్రసాద్ తో కలిసి పెద్దలకు పిండప్రదానం నిర్వహించారు. అనంతరం పుష్కర ఘాట్ లో స్నానమాచరించి కాళేశ్వర శివాలయం లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం తోపాటు మంత్రి శ్రీధర్ బాబు శాసన సభ్యులు మక్కన్ సింగ్, గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు.

పుష్కర స్నానం చేసిన మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు. హెలికాప్టర్ ద్వారా కాలేశ్వరం చేరుకొని సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానాలు చేశారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాలేశ్వరంలో టోల్ గేట్ రద్దు

సరస్వతి పుష్కరాలు సందర్భంగా కాలేశ్వరం విచ్చేసే భక్తుల వాహనాలకు టోల్గేట్ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వాహనాల నుంచి ఎలాంటి టోల్ గేట్ వసూలు చేయొద్దని ఆయన ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరంలో టోల్ గేట్ చెల్లించొద్దని సూచించారు. వాహనాలు రద్దీ నియంత్రణకు టోల్ గేట్ రద్దు చేసినట్లు ఆయన వివరించారు. పుష్కరాలు సమయంలో వాహనాల నుండి టోల్గేట్ ఫీజు వసూలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి సాధువులు సన్యాసులమని చెబుతున్న అందర్నీ కిందికి దించేసి బలవంతంగా టోల్గేట్ ఫీజు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఒక్కో వాహనానికి వంద రూపాయలు వసూలు చేయడం ఎన్నో రోజుల నుండి వాహనదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో పుష్కరాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ టోల్గేట్ రద్దు చేయడం పట్ల వాహనదారులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మరియు ఎస్పీ కిరణ్ ఖరే స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి నుండే ఇద్దరూ సరస్వతి ఘాట్, టెంట్ సిటీ, స్టాల్స్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వర్షం కారణంగా విద్యుత్తులో తాత్కాలిక అంతరాయం ఏర్పడిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టి మళ్లీ విద్యుత్ సరఫరా కొనసాగించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత సిబ్బందికి సూచనలు, మార్గదర్శకాలు అందజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment