వెంకటాపురం, వాజేడు మండలాలను చుట్టుముట్టిన గోదావరి వరదలు
- స్తంభించిన రాకపోకలు – నీట మునిగిన వంతెనలు.
- భారీ వర్షంతో అతలాకుతలం – లక్ష్మీపురం గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలను గోదావరి వరద నీరు చుట్టు ముట్టింది. అనేక వాగులు గుండా గోదావరి వరద నీరు చొచ్చుకు రావడంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయ మయ్యాయి. గోదావరి వరదలకు తోడు ఎడ తెరిపిలేని భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో పాటు గోదావరి వరదలతో అతలాకుతలమవుతున్నది. వెంకటాపురం టు చర్ల టు భద్రాచలం రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 పై వెంకటాపురం నుండి కుక్క మాకు వంతెన, ఆలుబాక, కొండాపురం వంతెన, రాళ్లవాగు ఇంక అనేక వాగులు పై వంతెనలు మునిగిపోవడంతో, వెంకటాపురం టు చర్ల భద్రాచలం కు రాకపోకలు స్తంభించిపోయాయి. వెంకటా పురం సమీపంలోని బల్లకట్టు వాగు వంతెన నీట మునిగిపోయింది. ఆలుబాక ,వీరభధ్రారం వద్ద వాగులు వంతెనలు వరదలో మునిగి పోయాఇ. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే వెంకటాపురం నుండి భద్రాచలం చర్ల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాహనదారులు, వెంకటాపురం-జగన్నాధపురం వై జంక్షన్ ఎటురునాగారం, మంగపేట మీదుగా మణుగూరు ప్రాంతాల నుండి చుట్టూ తిరిగి వెళుతున్నారు. వరంగల్ ఏటూరు నాగారం టు బీజాపూర్ ఎన్హెచ్ 163 జాతీయ రహదారి టేకుల గూడెం వద్ద గోదావరి వరద ముంచెత్త టంతో గత నాలుగైదు రోజులుగా రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో ఇరువైపులా అనేక వాహనాలు గత నాలుగు రోజులుగా రోడ్డుపైనే నిలిచి ఉన్నాయి.
– లక్ష్మీపురం గ్రామాన్ని చుట్టుముట్టిన -గోదావరి వరద
వెంకటాపురం మండలం పాత్ర పురం పంచాయతీ లక్ష్మీపురం గిరిజన గ్రామాన్ని బల్లకట్టు వాగు గుండా వరద నీరు చొచ్చు కు రావటం తో , లక్ష్మీపురం గ్రామం చుట్టూ గోదావరి వరద నీరు చేరటంతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తె గిపో యాయి. ఈ గ్రామం లో సుమారు 14 ఆదివాసి కుటుంబాలు తో సుమారు 70 మంది జనాభాతో కలిగి ఉంది. సమీపం లోని మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న పాత్రా పురం గ్రామానికి వెళ్లేందుకు రహదారి మధ్యలో ఉన్న పులిబొందల వాగు వంతెన వరదల్లో మునిగిపోవడంతో, కొండలపై నుండి తిరిగి పాత్రాపురం వచ్చి సరుకులు తీసు కొని వెళ్ళు చున్నారు. గ్రామ ఆదివాసులు రాకపోకలు సాగిస్తూ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామ గ్రామంలో సుమా రు 8 మందికి పైగా విద్యార్థులు, భారీ వర్షాలు, వాగులు గోదావరి వరదల కారణంగా గత వారం రోజులుగా మంగ వాయి, పాత్ర పురం పాఠశాలలకు వెళ్ళటం లేదు. వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం లక్ష్మీపురం గ్రామంలో గర్భిణీ స్త్రీ ఒకరు మాత్రమే ఉన్నారని నమోదయింది. ఈ గ్రామం లో శనివారం సాయంత్రం వరకు కూడా విద్యుత్ సరఫరా కొనసాగుతున్నది.వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉండ టంతో గ్రామస్తులంతా సమావేశమై, వరదల నుండి తాము కాపాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రెవెన్యూ, పో లీస్ శాఖలకు ఎప్పటికప్పుడు తమ గ్రామం వరద పరిస్థితిని తెలియపరుస్తూ, అవసరమైతే రక్షణ చర్యలు చేపట్టే విధంగా గ్రామాల్లోని ఆదివాసి పెద్దలు చందా కృష్ణయ్య, బాడిస బాబు, ఆదివాసీ యువకులు చర వాణీల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫ్లడ్ డ్యూటీ అధికారులకు, రెవెన్యూ, పోలీ సు అధికారులకు అందిస్తున్నారు. పాలెం ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరటంతో బలకట్టు వాగు డ్డునే ఉన్న లక్ష్మీపురం గ్రామం, వాగు ఉధృతి, గోదావరి ఉధృతి కారణంగా లక్ష్మీ పురం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఇలాంటి వరదలు, వాగులు ఎంతో కాలం నుంచి చూస్తున్నామని ,గ్రామ ఆదివాసీలు చరవాణి ద్వారా తెలిపారు. ఇప్పటివరకు వరదల వల్ల ఎటువంటి భయం లేదని, వరదలు ఇంకా పెరిగితే ప్రభుత్వ అధికారుల సహాయం తీసుకుంటామని, రెయింభవళ్ళు, అప్రమత్తంగా ఉంటున్నట్లు లక్ష్మీపురం ఆది వాసీలు చరవాణీల ద్వారా తెలిపారు.