ములుగు డిస్ట్రిబ్యూషన్ ప్లాంట్లో ఒకరికి ఫిట్స్
– ఏరియా హాస్పిటల్ కు తరలింపు
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నిక ల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి తీసుకునేందుకు వచ్చిన సిబ్బందిలో ఒకరికి ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే అధికారులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిం చారు. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన జంగిటి స్వామి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం విద్యాశాఖలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ములుగు లో నివాసం ఉంటు న్న ఈయన ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కు ఆదివా రం ఉదయం చేరుకున్నాడు. 11 గంటల సమయంలో ఒక్క సారిగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది 108 లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్వామి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
1 thought on “ములుగు డిస్ట్రిబ్యూషన్ ప్లాంట్లో ఒకరికి ఫిట్స్ ”