రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

Written by telangana jyothi

Published on:

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

– దేశంలో విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

తెలంగాణజ్యోతి, ములుగు ప్రతినిధి: దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉద్దేశపూరితమైనటువంటి రాజకీయాలు యువత మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఐక్యం చేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జూడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయలేని మూఢత్వంలో కొందరు ఉన్నారని, అది సరికాదని వెల్లడించారు. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే వారు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, వందలాది ఉద్యోగాలు సృష్టించారని కానీ ప్రస్తుతం ఆ సంస్థలన్నీ అమ్మబడుతున్నాయని సీతక్క విమ ర్శించారు. ప్రధాని అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతు న్న వారిని ప్రజలు విస్మరించాలని కోరారు. రాజకీయాల్లో మాత్రమే విద్వేషాలు ఉంటాయని మిగతా సమయంలో సోదర భావంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

1 thought on “రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.”

Leave a comment