పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
– వెంకటాపూర్ డాక్టర్ చీర్ల శ్రీకాంత్
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల భారిన పడకుండా ఉండవచ్చని వెంకటాపూర్ ఆరోగ్య కేంద్రం డాక్టర్ చీర్ల శ్రీకాంత్ అన్నారు. సోమవారం వెంకటాపూర్ మండలంలోని రామాం జాపూర్ శివారులోని చెంచు కాలనీ లో గల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హాస్టల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తే వ్యాధులు దరి చేరవని అన్నారు. విద్యార్థులకు ఎప్పుడు వేడివేడి ఆహారాన్ని అందించాల న్నారు. వంటశాల పరిశుభ్రంగా ఉంచాలని లేదంటే ఈగలు, దోమలు చేరి అనారోగ్యాల బారిన పడతారని సూచించారు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక ఏఎన్ఎం ను సంప్రదించాలని, సమస్య మరింత జటిలంగా ఉంటే వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డాక్టర్ భవ్య, సి హెచ్ ఓ సదానందం, ఏఎన్ఎంలు స్వర్ణలత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.