పీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ.
– 300 మహిళలకు రూ. 50 లక్షల విలువైన కుట్టు మిషన్లు అందజేత.
– 40 రోజుల పాటు భోజన, వసతి సౌకర్యాలతో శిక్షణ.
– ముఖ్య అతిధిగా హాజరైన వై. సతీష్ రెడ్డి.
ములుగు, జనవరి 16, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని నిరుద్యోగ మహిళల కోసం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్(పీ.ఎస్.ఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన 40 రోజుల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అనంతరం మహిళలకు 300 కుట్టు మిషన్లను ముఖ్యఅతిథిగా మంగళవారం యేరువ సతీష్ రెడ్డి హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ (పీ.ఎస్.ఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు రూ. 50 లక్షల విలువైన కుట్టు మిషన్లు అందజేసినట్లు తెలిపారు. 40 రోజుల పాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం నిరుద్యోగ మహిళల కోసం నిర్వహించడం జరిగిందని, 40 రోజుల పాటు భోజన వసతి సౌకర్యాలతో మంచి నైపుణ్యత ఉన్నటువంటి ట్రైనర్ల చేత మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మహిళలు కుట్టు మిషన్ నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మనోధైర్యంగా జీవితంలో ఎదగ వచ్చని అన్నారు. భవిషత్తులో మహిళలకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివార్ రెడ్డి (పీ.ఎస్.ఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యం లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ములుగు మండలంలోని బండారుపల్లి, జీవింతరావుపల్లి, ప్రేమ్ నగర్, జాకారం, మల్లంపల్లి, పందికుంట, మదనపల్లి, జగ్గన్నపేట, పత్తిపల్లి, అన్నంపల్లి, దేవగిరిపట్నం, కాసీందేవి పేట, కన్నాయిగూడెం, లాలాయి గూడెం,నల్లగుంట, బండారు పల్లి గ్రామాలకు చెందిన 300 మహిళలు 40 రోజుల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి మహేందర్ రెడ్డి, ఎలిశాల రజిత, కొండి రవిందర్, సానికొమ్ము దిలీప్ రెడ్డి, బాణాల రాజ్ కుమార్, శిక్షణ ముగించుకున్న మహిళలు పాల్గొన్నారు.