షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు చట్టం పటిష్టంగా అమలు చేయాలి.
-ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంమండల కేంద్రం ఆర్&బి గెస్ట్ హౌస్ ప్రాంగ ణంలో మంగళవారం ఏఎస్పి మండల కమిటీ సమావేశం నిర్వ హించారు. మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ, ఆదివా సీల సంక్షేమం కోసం బ్రిటిష్, నిజాం ప్రభుత్వాలు చేసిన ప్రత్యేక చట్టాల కొనసాగింపులో భాగంగా, భారత రాజ్యాంగంలోని, 5వ షెడ్యూల్ ప్రకారం అనేక సంక్షేమ చట్టాలను రూపొందించారని అన్నారు. ఆ చట్టాలు ఆచరణలో ఈ చట్టాలన్నీ ఘోరంగా విఫల మయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదలాయింపు చట్టం 1959 (లాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్) ఒకటి ఏజెన్సీ ప్రాంతంలో, 1/70, పేసా చట్టాలను సక్రమంగా అమలు పరిచేందుకు తహసిల్దార్ స్థాయి నుంచి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ఎంతో పకడ్బందీగా యం త్రాంగం ఉన్న,కేసుల పరిష్కరించడంలో ఆదివాసులకు న్యా యం జరగటంలో విపరీతమైన జాప్యం జరుగుతూ చట్టం ఉద్దేశించిన ప్రయోజనాలు ఘోరంగా దెబ్బతీస్తున్నారని వాపో యారు. ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎల్ టి ఆర్ తీర్పులకు న్యాయానికి నోచుకోక ప్రభుత్వ కార్యాలయాల్లో మగ్గుతున్నా యని మండిపడ్డారు. ఆదివాసి హక్కులు అమలు చేసే చిత్త శుద్ధి, చట్టం అమలు స్ఫూర్తి అధికారుల్లో లోపించిందని, ఆదివా సీలలో తమ ప్రాంతాలకు భూములకు పరాయి వారిగా మారిపో తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడకం రమేష్, బొగ్గుల గోపి, మీడియం వెంకటేశ్వర్లు, మడకం దివ్య కుమారి తదితరు లు పాల్గొన్నారు.