సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన నగదు చెక్కులను మండల కాంగ్రెస్ నాయకులు ఆయా కుటుంబాలకు పంపిణీ చేశారు. బి. రామలక్ష్మి అనే మహిళకు 60 వేల రూపాయల చెక్కును, సుశీల అనే మహిళకు 55 వేల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు ,మాజీ జడ్పిటిసి పాయం రమణ, కాంగ్రెస్ నాయకులు బాలసాని వేణు, జి. నాగేశ్వరరావు, మద్దు కూరి ప్రసాద్, ఇంకా పలువురు నాయ కులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.