ప్రమాదకరంగా విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్

Written by telangana jyothi

Published on:

ప్రమాదకరంగా విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్

పాఠశాల పక్కనుంచి వేరే చోటుకు మార్చాలని వినతి

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగుల గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బూడిదపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ మొగిలి రాజకుమార్ కోరారు. ఈ మేరకు శనివారం కాటారం మండలం విద్యుత్తు ఏఈ మేఘనాథ్ కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల ఆవరణలో ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి పాఠశాల ఉండడం, అందులోని పిల్లలు మైదానంలో ఆడుకుంటూ ఉండే ప్రాంతంలో రైతులకు సంబంధించిన విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ కు కంచె కూడా లేకపోవడంతో ప్రమాదకరంగా ఉందని ఆయన వివరించారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు ఉన్నటువంటి స్తంభాలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పిల్లలతో పాటు ఊరిలోని పశువులు, గొర్రెలు, మేకలు మేతకు ఈ ప్రాంతంలో సంచరిస్తాయని, అనుకోని ప్రమాదం విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ వల్ల జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ తీగలకు మనుషులు, పశువులు సైతం మృత్యువాత పడ్డాయని, ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా పాఠశాల నుంచి తొలగించి మరో చోటకు వంద మీటర్ల దూరంలో విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ ను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మొగిలి రాజ్ కుమార్ కోరారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now