పెద్దపల్లి ఎంపీ సీటును కైవసం చేసుకుంటం
– బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నాయకత్వం లో పెద్దపల్లి ఎంపీ సీటును కైవసం చేసుకుంటామని బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అరు గ్యారంటీ హామీలను తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం పరిది రూ. 10 లక్షలకు పెంపు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వంద రోజులలో అమలు చేయడం దేశం గర్వించదగ్గ విషయని అన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా హామీలను తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు ల నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ లోని అన్ని నియోజక వర్గాలు మరింత అభివృధి చెందుతాయని వెల్లడించారు.