విద్యుత్ షాక్ తో ఆవు మృతి
– మృతి చెందిన ఆవు విలువ 80 వేలు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపుర్ మండలం లోనీ మలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో గల వెంకటేశ్వర్ల పల్లి చెందిన చెందిన రైతు అజ్మీర రాజు ఆవు విద్యుత్ షాక్ తో సోమవారం పంట పొలాల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగల కు తాకి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. తెలిసిన వివరాల ప్రకారం సోమవారం మేతకు వెళ్లిన ఆవు రాకపోవడంతో ఎద్దు కొరకు రాజు తిరగడంతో విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . మృతి చెందిన ఆవు విలువ 80 వేల ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. మృతి చెందిన విషయాన్నితెలుసుకున్న విద్యుత్ శాఖ,వెటర్నరీ అధికారులు పంచనామా చేసినట్లు తెలిపారు.