బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

Written by telangana jyothi

Published on:

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

– చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు

– బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి

– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్

తెలంగాణజ్యోతి,భూపాలపల్లిప్రతినిధి:బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ అన్నారు. జూలై 1 నుండి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో పోలీస్ అధికారులు , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్ పరిధిలో రెండు టీమ్ లు ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి, జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం కృషి చేస్తారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ X కు  సంబందించిన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశ నిర్వహణతో పాటు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ఎస్పి కిరణ్ ఖరె గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ముస్కాన్- X కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 18సంవత్సరాల లోపు తప్పిపోయిన, వివిధ రకాల బాల కార్మికులు వారు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ మరియు వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే, అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై నూతన చట్టాలను అనుసరించి క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని,ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించు కొని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టా లని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసు లకు సమా చారం అందించాలని తెలిపారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ముష్కాన్ పోలిసు నోడల్ ఆఫీసర్ డిఎస్పి నారాయణ నాయక్, సీ డబ్ల్యూ సీ చైర్మన్ దామోదర్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ కొమురయ్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద, ఇన్స్పెక్టర్లు రవీందర్, రమేష్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భూపాలపల్లి, కాటారం ఆపరేషన్ మస్కాన్ టీంలు పాల్గొన్నారు.

Leave a comment